AP: రాష్ట్రంలో వైసీపీ మరో షాక్ తగిలింది. పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ దస్తగిరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన సతీమణి, 30వ వార్డు కౌన్సిలర్ షకీలా కూడా ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్కు లేఖ రాశారు. త్వరలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమక్షంలో దస్తగిరి దంపతులు టీడీపీలో చేరనున్నారు.