ఆఫ్రికా దేశమైన లైబీరియాలో అధ్యక్షుడు గద్దె దిగాలని ప్రతిపక్షా నేతలు ఆందోళన చేపట్టారు. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్లమెంటు స్పీకర్ పదవి వీడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని మన్రోవియాలోని పార్లమెంటు భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనపై విచారణకు అధ్యక్షుడు జోసెఫ్ బోవాకై ఆదేశాలు జారీ చేశారు.