AP: అనంతపురంలోని RDT స్వచ్ఛంద సంస్థపై మంత్రి లోకేష్ స్పందించారు. ‘RDT లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపింది. దశాబ్దాలుగా సేవలందించిన RDTకి తాత్కాలికంగా వచ్చిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం. దాని సేవలు అందేలా చూస్తాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. ఈ అంశంపై కేంద్రప్రభుత్వంతో గతంలోనే మాట్లాడాం. RDT సేవలు కొనసాగించేందుకు రాష్ట్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది’ అని అన్నారు.