కెనడా ప్రధానిపై ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. ‘ట్రూడోను వదిలించుకోవడానికి కెనడాకు సాయం చేయండి’ అంటూ ఎక్స్‌లో మస్క్‌ను ఓ యూజర్ కోరాడు. దీనిపై స్పందించిన మస్క్.. ‘అతడు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాడు’ అంటూ బదులిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించడంతో కీలక భూమిక వహించిన మస్క్ నుంచి ఈ విధమైన స్పందన రావడంతో కెనడాలో లిబరల్ పార్టీ గట్టెక్కడం కష్టమేనని నెట్టింట ప్రచారం జరుగుతోంది.