షాంఘై శిఖరాగ్ర సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. బెదిరింపు ప్రవర్తన, ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని ఈ ప్రపంచమంతా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశాలన్ని కలిసి పనిచేయాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బెదిరింపులను ఉద్దేశించి ఈ పరోక్షంగా జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.