AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ విమానం రన్ వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ విజయం ఏపీ విమానయాన రంగంలో సరికొత్త మైలురాయి అని అభివర్ణించారు. 2014-19 NDA ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఇవాళ సాకారమవుతోందని పేర్కొన్నారు.