అక్రమ వలసదారులను అమెరికా నుంచి తమ దేశానికి పంపుతున్నట్లు కోస్టారికా ప్రకటించింది. 200 మంది వలసదారులతో కూడిన విమానం రేపు తమ దేశానికి చేరుతుందని చెప్పింది. అందులో మధ్య ఆసియా, ఇండియాకు చెందినవారు ఉన్నారని పేర్కొంది. వారిని పనామా సమీపంలోని తాత్కాలిక వలసదారుల శిబిరానికి తరలించనున్నారు. అక్కడి నుంచి భారత్కు తరలిస్తారు. ఈ ప్రక్రియ మొత్తానికి అమెరికానే డబ్బు చెల్లిస్తుంది.