TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలిశారు. చెరువులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. చెరువుల కబ్జాపై రెండు నెలల క్రితమే చెప్పానని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది ఎవరని, వారిపై చర్యలేవని ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులు ఎవరైనా శిక్షార్హులేనని పేర్కొన్నారు.