AP: వాహనాదారులు హెల్మెట్ ధరించటాన్ని అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. పోలీసుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. ఈ ఏడాది జూన్- సెప్టెంబర్ వరకు 667 మంది హెల్మెట్ లేకపోవటం వల్ల మృతి చెందారని పిటిషనర్ తెలిపారు. రవాణా శాఖ కమిషనర్‌ను సుమోటోగా ఇంప్లీడ్ చేసింది. వారంలోగా కౌంటర్ వేయాలని ఆదేశింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.