TG: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాదయాత్ర జగిత్యాల గ్రామీణ మండలం చల్ గల్‌కు చేరుకున్నది. సంజయ్ పాదయాత్రను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరుట్లలో ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. మాజీ మంత్రి హరీశ్ రావు వేములవాడ నుంచి చల్ గల్‌కు చేరుకొని సంజయ్‌తో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. చల్ గల్ నుంచి జగిత్యాల కొత్త బస్టాండ్ కూడలి వద్దకు చేరుకొని కార్నర్ మీటింగ్‌లో హరీశ్ రావు ప్రసంగించనున్నారు.