AP: విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన సందర్భంగా కూటమి ప్రభుత్వంపై YCP నేతలు మండిపడ్డారు. ‘ఎన్నికల హామీలను సీఎం చంద్రబాబు మర్చిపోయారు. విద్యుత్ ఛార్జీలపై పవన్ ఇచ్చిన హామీ ఏమైంది. పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం ఆగదు’ అని మాజీమంత్రి రోజా తెలిపారు. ప్రతి కుటుంబంపై చంద్రబాబు అదనపు భారం వేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.