MNCL: దండేపల్లి మండలంలోని తానిమడుగు బీట్ పరిధిలో టేకు చెట్లు నరికిన రాజేష్‌ను రిమాండ్‌కు తరలించామని తాళ్లపేట ఎఫ్ఆర్వో సుష్మారావు తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. తానిమడుగు బీట్‌లోని 394వ కంపార్ట్మెంట్లో నరికిన టేకు చెట్ల వద్ద డాగ్ స్వాడ్‌కు ఆధారాలు చూపించగా రాజేష్ ఇంటి వద్ద ఆగిందన్నారు. రాజేష్ చెట్లను నరకడంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టామన్నారు.