యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులు రేప్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే అతణ్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ పోలీసులు దిశా యాప్ ప్రమోషన్స్ అంబాసిడర్‌గా నియమించారు. ప్రస్తుతం అలాంటి వ్యక్తిపైనే రేప్ కేసు నమోదైంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేరప్రవృత్తి ఉన్న వ్యక్తిని.. అమ్మాయిల భద్రత కోసం తీసుకొచ్చిన యాప్‌కే అంబాసిడర్‌గా పెట్టారా? అని విమర్శిస్తున్నారు.