AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నటుడు ప్రకాశ్ రాజ్, తమిళ హీరో కార్తీల మాటలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆలోచించి మాట్లాడాలని వారిపై ఫైర్ అయ్యారు కూడా. పవన్ వ్యాఖ్యలకు స్పందించిన కార్తీ.. ట్విటర్ వేదికగా క్షమించాలని కోరాడు. తాజాగా దీనిపై ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశాడు. “చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో.. జస్ట్ ఆస్కింగ్” అంటూ పవన్‌కు కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.