హీరో నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో సింపుల్గా జరగడంపై శోభితా తాజాగా స్పందించారు. ‘ఆ క్షణాలను పూర్తిగా ఆస్వాదించాలనుకున్నా. ఇలాంటి వేడుకలు గ్రాండ్గా జరగాలని నేను ఎప్పుడూ కలలు కనలేదు. సింపుల్, ప్రశాంతంగా, సంప్రదాయాలు, సంస్కృతికి పెద్దపీట వేసేలా జరగాలని అనుకున్నా. అదే విధంగా మా ఎంగేజ్మెంట్ జరిగింది’ అని చెప్పుకొచ్చారు.