గుజరాత్లో ప్యాసింజర్ రైలుకు ప్రమాదం తప్పింది. బొటాడ్ జిల్లా కుండి గ్రామ సమీపంలో రైలుని పట్టాలు తప్పించే కుట్ర జరిగింది. ట్రైక్ పై పడివున్న రైలు పట్టాని ఢీకొన్న ప్యాసింజర్ రైలు అక్కడే నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇకపోతే సెప్టెంబర్ నెలలోనే రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించిన ఐదో ఘటన ఇది.