దేశంలో 2023-24 పంటల సీజన్లో రికార్డు స్థాయిలో 332.22 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందని కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. 2022-23తో పోలిస్తే ఇది 2.61 మిలియన్ టన్నులు అధికమని పేర్కొంది. ఈ ఆహార ధాన్యాల్లో అత్యధికంగా వరి(137.82 మిలియన్ టన్నులు), గోధుమ(113.29 మిలియన్ టన్నులు) దిగుబడులు వచ్చాయని తెలిపింది.