AP: విజయనగరం జిల్లాలో విద్యార్థినుల అస్వస్థతపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. కలెక్టర్ అంబేద్కర్, డీఎంహెచ్వో జగన్నాథరావు నుంచి వివరాలు సేకరించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాగా.. విజయనగరం ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహంలో 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.