AP: నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఇదికాకుండా ఈ నెల రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, అది బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.