కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడ్లో నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ప్రియాంక దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించారు. ప్రియాంక గాంధీకి రూ. 12 కోట్ల ఆస్తులు, భర్తకు రూ. 65 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో రూ.4.25 కోట్ల చరాస్తులు, రూ.7.74 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రూ.1.15 కోట్లు విలువచేసే 4400 గ్రాములకు పైగా బంగారం ఉంది.