జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి దేశ భద్రతా బలగాలు పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మాట్లాడిన ఆయన.. ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని తెలిపారు. డ్రగ్స్, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పంతో ఉన్నామని పేర్కొన్నారు.