TG: హైడ్రా కమిషనర్‌పై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. ‘రంగానాథ్ హీరోలా ఫీల్ అవుతున్నారు. పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు. సీఎం రేవంత్ సోదరుడికి నెల రోజులు, పేదలకు ఒక్కరోజు ముందు నోటీసులు ఇస్తారా. రాత్రికి రాత్రి రాబిన్ హుడ్ అవుదాం అనుకుంటున్నారా. బ్యాంకర్లకు లోన్లు ఇవ్వొద్దని రంగనాథ్ చెబుతున్నారు. అసలు రంగనాథ్‌కు ఏం అధికారం ఉంది. ఇలా చేస్తే.. పక్క రాష్ట్రంలో ఏ గతి పట్టిందో చూడండి’ అంటూ హెచ్చరించారు.