AP: తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ‘గుడికి వెళితే హిందూ ఆచారాలు గౌరవిస్తా. ఇస్లాం విధానాలను ఆచరిస్తా. నా కులం, మతం ఎవరికీ తెలియదా? 5సార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించా.. 15 సార్లు తిరుమలకు వెళ్లా. మొదటిసారి వెళ్లే వాళ్లను డిక్లరేషన్ అడిగితే బాగుంటుంది. డిక్లరేషన్లో నా మతం మానవత్వం అని రాసుకోండి’ అంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.