AP: సాగునీటి సంఘాల ఎన్నికల జీవో జారీపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఈ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నవంబరు తొలివారంలోగా సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామని అన్నారు. అలాగే, సాగునీటి వ్యవస్థను బాగుచేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.