లిక్కర్ స్కాం కేసులో తాను జైలు జీవితం గడిపడంపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. “నా అరెస్టుతో మీరు ఏం సాధించారని ఓ బీజేపీ సీనియర్ నేతను అడిగాను. ఢిల్లీలో ప్రభుత్వ పాలన పట్టాలు తప్పిందని.. పనులన్నీ నిలిచిపోయాయని ఆయన చెప్పడం విని షాకయ్యా. పనులు ఆగిపోయేలా చేసి.. ప్రజలకు అసౌకర్యం కలిగించడమే వారి ఉద్దేశమా? నిలిచిపోయిన పనులన్నీ జరిగేలా చేస్తానని ఢిల్లీ ప్రజలకు మాటిస్తున్నా” అని కేజ్రీవాల్ అన్నారు.