అమెరికా, ఫ్రాన్స్ చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఖండించింది. ఈ ప్రతిపాదనకు ప్రధాని నెతన్యాహు కనీసం స్పందించలేదని పీఎం కార్యాలయం పేర్కొంది. ఉత్తర ప్రాంతంలో దాడుల తీవ్రతను తగ్గించాలని ఆదేశాలు వెలువడినట్లు వచ్చిన వార్తలూ అసత్యమేనని.. ఐడీఎఫ్ తన పూర్తి శక్తిసామర్థ్యాలతో పోరాటాన్ని కొనసాగించాలని ప్రధాని సూచించినట్లు తెలిపింది. గాజాలోనూ పోరు కొనసాగుతుందని ప్రకటించింది.