కొంతమందికి శునకాలు పెంచుకోవడమంటే చాలా ఇష్టం. రోజు వాటితో జీవించే వారు అవి లేకుండా ఉండలేరు. అలాంటి క్రమంలో ఆ జంతువు తప్పిపోతే వారి బాధ వర్ణణాతీతమని చెప్పవచ్చు. అలాంటి సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. అక్టోబర్ 1న వ్యాపారవేత్త దినేష్ చంద్ర కుమార్తె కుక్క కోసం ఏకంగా లండన్ నుంచి ఇండియాలోని మీరట్‌కు వచ్చారు.
తమ పెంపుడు శునకం ఆగస్ట్…సెప్టెంబర్ 24 నుంచి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన కుక్కను కనుగొనేందుకు తాను ఇండియాలోనే కొన్ని రోజులు ఉండనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతేకాదు కుక్కను తీసుకొచ్చిన వారికి 15 వేల రూపాయల రివార్డును కూడా అందిస్తామని సోషల్ మీడియాలో ప్రకటించారు.