పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించారు. దీనికి సంబంధించి టీచర్లు టీచర్లను సింగపూర్ పంపించటానికి ఏర్పాట్లు కూడా చేసింది. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. విద్యా వ్యవస్థను పూర్తిగా మారుస్తామని ఆప్ పంజాబ్ ప్రజలకు హామీ ఇచ్చింది. దీంట్లో భాగంగానే..పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచటానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను సింగపూర్‌కు పంపి శిక్షణ ఇస్తున్నామని అక్కడ ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు దేశ నిర్మాతలు వారు మెరుగైన విద్యాప్రమాణాలు పిల్లలకు నేర్పించాలని అందుకోసం సింగపూర్ లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని దీంట్లో భాగంగా మొదటి బ్యాచ్ లో 36మంది ఉపాధ్యాయులు ఫిబ్రవరి 4న సింగపూర్ వెళ్లనున్నారని తెలిపారు. వీరు వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 11న తిరిగి వస్తారని తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామనే ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చామని అది నెరవేర్చుకోవటానికి ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. రాష్ట్రం విద్యారంగంలో విప్లవ వాగ్దానం నెరవేర్చటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.