»Toyota Innova Highcross This Is The Worlds First Car That Runs On Ethanol
Toyota Innova Highcross: ఇథనాల్‌తో నడిచే కారు రెడీ..ప్రపంచంలోనే తొలి కారు ఇదే
మార్కెట్లోకి ఇథనాల్ కారు వచ్చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్ కారును ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ఇథనాల్ ఆధారిత వెహికల్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకూ పెట్రోల్, డీజిల్‌తో నడిచే వెహికల్స్ ఉన్నాయి. ఇకపై ఇథనాల్ ఆధారిత వెహికల్స్ అందుబాటులోకి రానున్నాయి. తాజాగా 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారును మార్కెట్లోకి విడుదల చేశారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Minister Nitin Gadkari) మంగళవారం ఈ కారును విడుదల చేయడం విశేషం. ఇది ప్రపంచంలోనే మొదటి ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ వెహికల్ కావడం విశేషం.
ఈ కారు రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Highcross) రూపొందింది. ఈ కారులో ఇథనాల్ ద్వారా 40 శాతం విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ ఇథనాల్ సుమారుగా రూ.60లు పలుకుతోంది. కారును ఆవిష్కరించిన సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..ప్రస్తుతం ఎలక్ట్రిక్ చార్జింగ్ తో నడిచే వాహనాలు పెరుగుతున్నాయని, అయితే ఇథనాల్‌తో నడిచేవి లేవన్నారు. త్వరలోనే అవి కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇప్పటికే దేశంలో టయోటా (Toyota), మారుతి సుజుకి (Maruti suzuki), టాటా మోటార్స్ (TATA Motors), మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra Company) తదితర కార్ల తయారీ సంస్థలు ఫ్లెక్సీ ఫ్యూయల్ కార్ల (Flexi Fuel Cars)ను తయారు చేస్తుండగా త్వరలోనే ఇథనాల్ కార్లు రోడ్లపై తిరగనున్నాయన్నారు. దీనివల్ల కాలుష్యం (Pollution) రేటు కూడా తగ్గుతుందన్నారు.