»The Man Who Brutally Killed The Puppy The Union Minister And Cm Shivraj Singh Reaction
Puppyని దారుణంగా చంపిన వ్యక్తి..రియాక్ట్ అయిన కేంద్ర మంత్రి, సీఎం
ఓ వ్యక్తి చిన్న కుక్కపిల్ల పట్ల అత్యంత కర్కషంగా వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన చిన్న కుక్కపిల్లను నేలపై విసిరి క్రూరంగా చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర మంత్రితోపాటు సీఎం కూడా స్పందించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
The man who brutally killed the puppy The Union Minister and cm shivraj singh reaction
మధ్యప్రదేశ్(madhya pradesh)లోని గుణ(guna) ప్రాంతం నుంచి ఒక భయంకరమైన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి కుర్చున్న వద్దకు రెండు చిన్న కుక్కపిల్లలు వచ్చాయి. ఆ క్రమంలో అతను అసహ్యంతో ఒక కుక్కపిల్లను పట్టుకుని బలంగా నేలపై కొట్టాడు. అంతేకాదు ఆ తర్వాత దానిని కాలితో తొక్కేశాడు. దీంతో ఆ కుక్కపిల్ల మృత్యువాత చెందింది. అయితే ఆ ఘటన సమయంలో ఓ దుకాణం లోపల ఉన్న మరో వ్యక్తి కుక్కపిల్ల అరుపులు విని బయటకు వచ్చాడు. దీంతో అతన్ని చూసిన ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరొక వినియోగదారు “అతను తప్పకుండా శిక్షించబడాలి” అని రాశాడు. ఇలా పలువురు అతన్ని శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు ఆ వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి అని పలువురు అంటున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Deeply disturbed by the horrifying incident. Swift and strict action will be taken to ensure justice is served. We unequivocally condemn such acts of barbarism, and the individual responsible will face the consequences. https://t.co/yYdCyKli64
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తన అధికారిక X ఖాతాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ట్యాగ్ చేస్తూ ఈ వీడియో గురించి మళ్లీ పోస్ట్ చేశారు. ఆ వైరల్ వీడియోపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ వ్యక్తిపై త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. “భయంకరమైన సంఘటనతో తీవ్ర కలత చెందాను. న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి అనాగరిక చర్యలను మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని అన్నారు. బాధ్యులు పర్యవసానాలను ఎదుర్కొంటారని సిఎం చౌహాన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.