DibangValley: అరుణాచల్​, చైనా బార్డర్‌లో కొండ చరియలు విరిగిపడి హైవే తెగిపోయింది.. వీడియో వైరల్

అరుణాచల్ ప్రదేశ్‌-చైనా సరిహద్దులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న 33 జాతీయ రహదారి తెగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 04:13 PM IST

DibangValley: అరుణాచల్ ప్రదేశ్‌-చైనా సరిహద్దులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రెండు సరిహద్దు ప్రాంతంలో ఉన్న 33వ నంబర్ జాతీయ రహదారి అడ్డంగా తెగిపోయింది. ఈ హైవే చైనా సరిహద్దు అయిన దిబంగ్ వ్యాలీకి వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం. భారీ కొండచరియలు విరిగిపడడంతో ఆ దారి పూర్తిగా ధ్వంసం అయింది. ఇక ప్రాంతానికి వెళ్లడం అసాధ్యం అని వీడియోలు చూస్తుంటే అర్థం అవుతుంది. కొన్ని రోజులుగా అరుణాచల్ ప్రదేశ్‌లో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.

చదవండి:Kanpur : ఎన్నికల సిత్రాలు.. రోగికి బదులుగా అంబులెన్స్ లో ప్రచార సామగ్రి

మాములగానే ఈశన్య ప్రాంతాలలో కొండలపై నుంచి పెద్ద పెద్ద బండలు రోడ్లపై పడుతుంటాయి. ఇక ఏకధాటి వర్షంతో కొండలు, లోయల మీదుగా నీటి ప్రవాహాలు పెరిగింది. దీంతో దిబంగ్ వ్యాలీకి దగ్గర్లో ఉన్న హైవేపై హున్లి, అనిని పట్టణాల నడుమ కొండ చరియలు విరిగి రోడ్డు మీద పడ్డాయి. ఈ తాకిడికి రోడ్డు పూర్తిగా తెగిపోయింది. దీంతో దిబంగ్ వ్యాలీకి వెళ్లడానికి మరో మార్గం లేదు. ప్రస్తుతం ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీన్ని పునరుద్ధరించాలంటే మూడు రోజులైనా పడుతుందని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పేర్కొన్నారు. దిబంగ్ వ్యాలీ చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంది కాబట్టి వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

చదవండి:Bihar : పాట్నాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం