»Election Campaign Material Of Congress Candidate Alok Mishra Being Carried In The Ambulance
Kanpur : ఎన్నికల సిత్రాలు.. రోగికి బదులుగా అంబులెన్స్ లో ప్రచార సామగ్రి
దేశంలో ఎన్నికలు రాగానే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. దానిని అందరూ పాటించాల్సిందే. ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నికల అభ్యర్థులకు చాలా కఠినమైన నిబంధనలు అమల్లోకి వస్తాయి.
Kanpur : దేశంలో ఎన్నికలు రాగానే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. దానిని అందరూ పాటించాల్సిందే. ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నికల అభ్యర్థులకు చాలా కఠినమైన నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయినప్పటికీ, కొంతమంది అభ్యర్థులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూనే ఉంటారు. ప్రవర్తనా నియమావళిని నిర్మొహమాటంగా ఉల్లంఘించిన కేసు ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కనిపించింది.
దేశంలో లోక్‌సభ ఎన్నికల గాలి వీస్తోంది. ఎక్కడ చూసినా ప్రచార సందడి మాత్రమే కనిపిస్తోంది. మొదటి దశ ఎన్నికలు ముగియగా, రెండో దశకు కూడా చాలా రోజులు సమయం లేదు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన అలోక్ మిశ్రాకు కూటమి టికెట్ ఇచ్చింది. బుధవారం సాయంత్రం పోలీసులు అనుమానంతో అంబులెన్స్‌ను తనిఖీ చేయగా అందులో కాంగ్రెస్ జెండాలు, అలోక్ మిశ్రా ప్రచార సామగ్రి కనిపించాయి. అస్వస్థతకు గురైన వారిని త్వరితగతిన ఆసుపత్రికి తరలించాల్సిన అంబులెన్స్‌ను సదరు నాయకుడు తన పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడని తెలిసి అవాక్కయ్యారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. అంబులెన్స్ డ్రైవర్‌ను అడగగా, ఈ ప్రచార సామగ్రి అంతా అలోక్ మిశ్రా ఆదేశాల మేరకు తీసుకున్నట్లు డ్రైవర్ చెప్పాడు.
అంబులెన్స్‌లో భారీ మొత్తంలో కాంగ్రెస్ ప్రచార సామగ్రి ఉంది. ఈ అంబులెన్స్ అలోక్ మిశ్రా స్కూల్ నుంచి పదే పదే వస్తుండటం, వెళ్తుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ అంబులెన్స్‌లో అక్రమంగా ప్రచార సామగ్రి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థి అలోక్ మిశ్రా సహా ముగ్గురిపై కేసు నమోదు చేశామని, ఈ అంబులెన్స్ ఉన్న ఆసుపత్రిపై కూడా విచారణ జరుపుతామని డీసీపీ ఆర్ఎస్ గౌతమ్ తెలిపారు.