తమిళనాడులో నమ్మిన స్నేహితురాలిని నట్టేటముంచి విదేశాలకు చెక్కేసింది ఓ కిలాడీ లేడీ. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మహిళకు ప్రేమతో కోడి కూర తెచ్చి వడ్డించి కోట్ల రూపాయలు కొట్టేసి ఎంచక్కా చెక్కేసింది.
Tamilnadu : తమిళనాడులో నమ్మిన స్నేహితురాలి(Friend)ని నట్టేటముంచి విదేశాలకు చెక్కేసింది ఓ కిలాడీ లేడీ(Lady). రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారం చేసే మహిళకు ప్రేమతో కోడి కూర(Chicken Curry) తెచ్చి వడ్డించి కోట్ల రూపాయలు కొట్టేసి ఎంచక్కా చెక్కేసింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు(Coimbatore)లోని రామనాథపురం కృష్ణ కాలనీలో రాజేశ్వరి అనే మహిళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటుంది. ఆమెకు వర్షిణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వీరు కలిసిన ప్రతీసారి వ్యాపారం(business) గురించి మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో రాజేశ్వరి(Rajeshwari) దగ్గర భారీ నగదు ఉన్నట్లు పసిగట్టింది. ఎలాగైనా దానిని కొట్టేయాలని ప్లాన్(Plan) వేసింది. ఈ క్రమంలోనే రాజేశ్వరితో వేలాది ఎకరాలు కొనేందుకు తన వద్ద కొంతమంది కస్టమర్లు ఉన్నారని చెప్పింది. వెంటనే రాజేశ్వరి తనకు పరిచయం చేయమని వర్షిణిని కోరింది. ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం వర్షిణి(Varshni) తన స్నేహితులైన అరుణ్‌కుమార్, సురేంద్రన్, ప్రవీణ్‌లను కస్టమర్లుగా రాజేశ్వరి ఇంటికి తీసుకుని వచ్చి పరిచయం చేసింది.
ఈ క్రమంలో వచ్చేటప్పుడే స్పెషల్ చికెన్(Chicken) తీసుకుని వర్షిణి రాజేశ్వరి ఇంటికి చేరుకుంది. ఇంటిలో అందరూ భోజనం చేస్తూ మాట్లాడుతుండగా సడన్ గా రాజేశ్వరి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే వర్షిణి ఆమె స్నేహితులు ఇంట్లో ఉన్న రెండున్నర కోట్ల డబ్బు… వంద సవర్ల బంగారం(Gold), ఆభరణాలతో పరారయ్యారు. మత్తు నుంచి తేరుకోగానే రాజేశ్వరి తన ఇంట్లో దోపిడీ జరిగినట్లు గమనించింది. వెంటనే చోరీ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వర్షిణి ఆమె స్నేహితులపై కేసు నమోదు చేశారు. అనంతరం వర్షిణి స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వర్షిణితో వచ్చిన ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కీలాడి లేడి వర్షిణి కోసం కోయంబత్తూరు పోలీసులు గాలిస్తున్నారు. వర్షిణి విదేశాల(Abroad)కు పరారీ అయినట్లు ఆమె స్నేహితులు చెబుతున్నారు.