»Pm Modi Proved Me Wrong Says Padma Shri Awardee Shah Rasheed Ahmed Quadri
Padma Awards: ముస్లీంలకు ఏమీ ఇవ్వరనుకున్నా.. నా ఆలోచన తప్పని మోడీ నిరూపించారు
తనకు కాంగ్రెస్ హయాంలోనే పద్మ అవార్డు వస్తుందనుకున్నానని, కానీ ఇవ్వలేదని, బీజేపీ వచ్చాక మోడీ ఇవ్వరని భావించినప్పటికీ తన ఆలోచన తప్పని నిరూపించారని కర్నాటక ముస్లీం ఆర్టిస్ట్ ఖాద్రీ అన్నారు.
వివిధ పార్టీలు చెబుతున్నట్లుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం (BJP government) ముస్లీంలకు ఏమీ ఇవ్వదని తాను భావించానని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ తన ఆలోచన తప్పని నిరూపించారని పద్మశ్రీ అవార్డు గ్రహీత షా రషీద్ అహ్మద్ ఖాద్రీ అన్నారు (Padma Shri awardee Shah Rasheed Ahmed Quadri). బుధవారం రాష్ట్రపతి భవన్ లో 2023 పద్మ అవార్డుల (Padma Awards of 2023) పురస్కారాల ప్రధానం జరిగింది. 53 మంది విశిష్ట వ్యక్తులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (president of india, droupadi murmu) ఈ అవార్డులను అందించారు. తెలుగు వారైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి పద్మభూషణ్, సినీ సంగీత దర్శకులు కీరవాణి, చిరు ధాన్యాల ప్రచారకర్త దూదేకుల ఖాదర్ వలీ (కర్నాటక నుండి), డాక్టర్ అబ్బారెడ్డి నాగేశ్వర రావులు పద్మశ్రీలను స్వీకరించారు. కర్నాటకకు చెందిన ముస్లీం క్రాఫ్ట్ ఆర్టిస్ట్ షా రషీద్ అహ్మద్ ఖాద్రీకి కూడా పద్మశ్రీ వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్రపతి ముర్ము నుండి అవార్డు అందుకున్న అనంతరం అవార్డు గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోడీ (pm narendra modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో (union home minister amit shah) కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఖాద్రీతోను కాసేపు ముచ్చటించారు. ఖాద్రీని చూసిన మోడీ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి, విష్ చేశారు. ఈ సందర్భంగా సదరు ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తనకు కేంద్రంలో 2004 నుండి 2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అవార్డు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ అప్పుడు రాలేదని చెప్పారు. ఆ తర్వాత 2014లో మీ ప్రభుత్వం వచ్చాక నాకు బీజేపీ ఇలాంటి అవార్డులు ఇవ్వదని నిర్ణయానికి వచ్చానని, కానీ మీరు నా ఆలోచన తప్పని నిరూపించారని, ఇందుకు కృతజ్ఞతలు అని ప్రధాని మోడీతో అన్నారు. సాధారణంగా కాంగ్రెస్ సహా బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు మైనార్టీలకు ఈ పార్టీని బూచీగా చూపిస్తాయి. దీంతో చాలామంది అలా ఫిక్స్ అయిపోయారు. అయితే ఖాద్రీ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఖాద్రీ అలా చెప్పిన తర్వాత మోడీ చిరునవ్వు నవ్వి, ఆయనకు నమస్కరించి వెళ్లిపోయారు.
మరో ఆసక్తిరమైన విషయం ఏమంటే మోడీ, ఖాద్రీ మాట్లాడుకుంటున్న వీడియోను సౌదీ జర్నలిస్ట్ సౌద్ హఫీజ్ ట్వీట్ (saudi journalist saud hafiz) చేశారు. అవార్డు గ్రహీత ఖాద్రీ, ప్రధాని మోడీ మధ్య పరస్పర గౌరవం, రెండు వైపుల ప్రశంసలతో కూడిన సంభాషణ ఇది అని పేర్కొన్నారు. ఈ వీడియోను 20వేల మందికి పైగా చూశారు.