దేశ రాజధాని ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడానికి ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా భారీగా రైతు సోదరులు ట్రాక్టర్లతో తరలి వెళుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు 144 సెక్షన్‌ని విధించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన 'చలో ఢిల్లీ' పాదయాత్రను అడ్డుకునేందుకు కేంద్ర మంత్రుల బృందం సోమవారం సాయంత్రం రైతు నేతలతో చర్చలు ప్రారంభించింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని రాజస్థాన్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయవచ్చు. దీనిని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేసింది.
వ్వవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఆసక్తి చూపడం లేదని రైతు సంఘాలు వాపోతున్నాయి. సేద్యం చేసే అబ్బాయిలను మ్యారెజ్ చేసుకునే అమ్మాయిలకు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు.
పసిడి బాండ్లపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సోమవారం నుంచి సబ్స్క్రిప్షన్లు ప్రారంభం అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాము పసిడి ధరను రూ.6,263గా ప్రకటించింది.
దేశీయ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
మస్కిటో టోర్నడోలు మధ్య అమెరికా, రష్యాలలో వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు పూణెలో మొదలయ్యాయి. దీని వలన ఐటీ పార్క్‌లు, స్కూళ్లు, స్టేడియంలు, ఓల్డేజ్ హోంలో దోమలు చేరి దారుణంగా ఇబ్బంది పడుతున్నాయి.
చాలా మంది సాహసోపేత క్రీడల్లో పాల్గొనేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. అలా పారాగ్లైడింగ్‌లో పాల్గొన్న ఓ హైదరాబాదీ వ్యక్తి ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే...
క్యూబాలో ఓ విచిత్రమైన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. క్యూబాలో 30 మంది దొంగలు దాదాపు 133 టన్నుల చికెన్‌ను అపహరించారు.
ఫిబ్రవరి 13న రైతుల ప్రతిపాదిత 'ఢిల్లీ చలో' మార్చ్‌కు ముందు ఢిల్లీతో సహా అంబాలా, జింద్, ఫతేహాబాద్ జిల్లాల్లో పంజాబ్-హర్యానా సరిహద్దులను మూసివేశారు. సరిహద్దులో సిమెంట్ బారికేడింగ్ వేసి రోడ్డుపై గుంతలు చేశారు.
కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టం తీసుకురావాలని, రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హర్యానా రైతులు చలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా స్థానాలను గెలుచుకొంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఒక్కో బూత్‌లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలని మోదీ తెలిపారు. 370 స్థానాలకు పైగా బీజేపీ గెలిచేలా ఆశీర్వదించాలని కార్యకర్తలను, ఓటర్లను కోరారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో తన ఉనికిని బలోపేతం చేసుకునే దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. కాగా, రేపు ఢిల్లీ సీఎం, ఆప్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాంనగరి అయోధ్యను సందర్శించనున్నారు.
రాజస్థాన్‌లోని సిరోహి మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ మహేంద్ర మేవాడా, అప్పటి కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసు నమోదైంది. పాలి జిల్లాకు చెందిన ఒక మహిళ ఈ విషయంపై ఫిర్యాదు చేసింది.
ఢిల్లీ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం దిగిన తర్వాత అమృత్‌సర్‌కు చెందిన ఇండిగో విమానం ట్యాక్సీవేను మిస్ అయింది. దీంతో దాదాపు 15 నిమిషాల పాటు ఒక రన్‌వే నిలిచిపోయింది.