2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యుల్‌ని కేంద్ర ఎన్నికల కమిషన్ నేడు వెల్లడించనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కోర్టు బెయిల్ బాండ్‌ను అంగీకరించి కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.
బీహార్‌లో నితీష్ కుమార్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈరోజు మంత్రివర్గంలోకి చాలా మంది కొత్త ముఖాలు చేరాయి. మంత్రివర్గంలో మొత్తం 21 మంది నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రధాని మోడీ కోయంబత్తూరు ర్యాలీకి మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆమోదం తెలిపింది. అయితే దీనికి కొన్ని షరతులు కూడా పెట్టారు.
ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల(ఈవీఎం) పనితీరులో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. మార్చి 16 అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
భారతీయ స్టేట్ బ్యాంక్‌పై సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల విషయంలో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.
సార్వత్రిక ఎన్నికలు ముందున్న వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని స్వల్పంగా తగ్గించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వీటి ధరలు ఎంత ఉన్నాయంటే..
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మైనర్ బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
యమున, గంగా నదుల మధ్య ఉన్న భూమంతా తనదే అంటూ ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అతని పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అలాగే న్యాయస్థానం సమయం వృథా చేసినందుకు రూ.లక్ష జరిమానా విధించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి నుదుటిపై తీవ్ర గాయమైంది. ఇంట్లో కాలు జారి పడిపోవడంతో ఈ గాయమైంది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది.
ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి ఇవాళ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారంచేశారు. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌కర్ తన ఛాంబర్‌లో ఆమె చేత ప్రమాణం చేయించారు.
ఒకే దేశం.. ఒకే ఎన్నికలు పేరుతో దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసి.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ నివేదికను సమర్పించింది.