జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కర్ణాటక కోర్టు జూన్ 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అసభ్యకర వీడియో కేసులో ఇరుక్కున్న రేవణ్ణను మే 31న పోలీసులు అరెస్ట్ చేశారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం (జూన్ 10) జరిగిన ఈ దాడిలో ఒక సైనికుడు గాయపడ్డాడు. మిలిటెంట్లు కాంగ్‌పోక్పి జిల్లాలో మెరుపుదాడి చేశారు.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు మరో 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 5 మంది స్వతంత్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. మోడీ మంత్రి వర్గంలో ఈసారి ఏడుగురు మహిళలకు మంత్రులుగా సేవ చేసే అవకాశం లభించింది.
దేశ 18వ లోక్‌సభకు ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారతదేశంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తొలిసంతకం రైతుల కోసం పెట్టారు. రాబోయే రోజుల్లో రైతులకు, కార్మికులకు పెద్దపీట వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మోదీ 3.0 మొదలైంది. ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ భారత దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రయాణికులు, పర్యాటకులు ఉన్న ఓ బస్సుపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్‌కు చెందిన చిరాగ్ పాశ్వాన్ నరేంద్రమోడీ మనసును దోచుకున్నాడు. కేంద్ర కేబినెట్‌లో స్థానం సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే కీలక బాధ్యతలు చేపడుతున్నాడు. ఎన్డీఏ కూటమి సమావేశంలో తనదైన శైలిలో ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. జూన్ 7వ తేదీన ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఒడిశా నుంచి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేడీ నేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీకే పాండియన్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.