ఎన్నికల వేళ భారీగా డబ్బు పట్టు బడుతోంది. ఛత్తీస్ గఢ్‌లో ఓ డ్రైవర్ ఇంట్లో భారీగా నగదు దొరికింది. రెండు చోట్ల రూ.5 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Rs.5 Crore Cash Seize: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికారులకు డబ్బుల సంచులు పట్టుబడుతున్నాయి. రూ.కోట్లలో నగదు, మద్యం, చీరలు లభిస్తున్నాయి. ఛత్తీస్ గఢ్‌లో రూ.5 కోట్ల క్యాష్ (Rs.5 Crore) దొరికింది. దీంతో ప్రలోభాల పర్వం ఏ మేరకు జరుగుతుందో అర్థం అవుతోంది.
భిలాయ్‌లో గల డ్రైవర్ (driver) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. నోట్ల కట్టలను గుర్తించారు. ఆ నగదు మొత్తం రూ.1.8 కోట్లు అని తెలిపారు. రాయ్‌పూర్‌లో గల హోటల్లో రూ.3.12 కోట్ల నగదు దొరికింది. మొత్తం రూ.5 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ఆ డ్రైవర్ దుబాయ్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. నగదును మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు పంపించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
అరబ్ నుంచి వచ్చిన ఆసీం దాస్ అలియాస్ బప్పాను రాయ్‌పూర్‌లో గల హోటల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇతని వాహనంలో రూ.3.12 కోట్ల నగదు ఉంది. బిలాయ్‌కు చెందిన కౌన్సిలర్ వద్ద గతంలో ఇతను కారు డ్రైవర్‌గా పనిచేశారని తెలిసింది. రూ.5 కోట్లే కాదు.. బినామీ అకౌంట్లను గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ నగదు కలిపితే రూ.10 కోట్ల వరకు ఉంటుంది.
ఆ ఖాతాల్లో కొందరు ప్రభుత్వ అధికారుల ఖాతాలు కూడా ఉన్నాయి. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ ఛత్తీస్ గఢ్‌కు చెందినవారే.. ప్రస్తుతం యూఏఈ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు అనుమానిస్తున్నారు.