కార్పొరేట్ రంగం(Corporate sector)లో ఉద్యోగుల పని వాతావరణం రోజురోజుకూ దిగజారుతోందని, ఇంతకంటే దారుణం ఉంటుందా అంటూ మండిపడుతున్నారు. విషయం కాస్త కంపెనీ చెవిన పడటంతో కోడింగ్ నింజాస్ స్పందించింది. తమ కంపెనీకి చెందిన ఓ కార్యాలయంలో ఓ ఉద్యోగి చేసిన విపరీత చర్య వల్లే తాము అలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నామని, అయితే కొద్ది క్షణాల్లోనే దాన్ని సరిదిద్దామని కంపెనీ సమర్థించుకుంది.హరియాణా(Haryana) రాష్ట్రంలోని గురుగ్రామ్ (Gurugram)కు చెందిన కోడింగ్ నింజాస్ (Coding Ninjas) అనే ఎడ్టెక్ (ED-Tech) కంపెనీ వాచ్మెన్ ఆఫీసు డోర్‌కు తాళాలు వేస్తూ కన్పించారు. అదేంటని అడిగితే.. ‘‘అనుమతి లేకుండా ఏ ఉద్యోగిని బయటకు పంపించొద్దని మేనేజర్ చెప్పారు. బయటకు వెళ్లాలంటే పర్మిషన్ తెచ్చుకోండి’’ అని వాచ్మెన్ చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. నిర్వాకం విమర్శలకు దారితీసింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది. అందులో వాచ్మెన్ ఆఫీసు డోర్‌కు తాళాలు వేస్తూ కన్పించారు. అదేంటని అడిగితే.. ‘‘అనుమతి లేకుండా ఏ ఉద్యోగిని బయటకు పంపించొద్దని మేనేజర్ చెప్పారు. బయటకు వెళ్లాలంటే పర్మిషన్ తెచ్చుకోండి’’ అని వాచ్మెన్ చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది.అయితే, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని, ఇలాంటివి తమ విలువలకు విరుద్ధమని తెలిపింది. గత ఏడేళ్లుగా భారత యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు తాము ఎంతో కష్టపడుతున్నామని పేర్కొన్నది. అయితే ఈ ఘటన బయటికొచ్చిన తీరు దురదృష్టకరమని, దీని వల్ల అసౌకర్యానికి గురైన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు తెలియజేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.