ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో కార్తి మాంచి దూకుడు మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవుతున్నాడు. రీసెంట్గా పొన్నియన్ సెల్వన్‌తో సాలిడ్ హిట్ కొట్టిన కార్తి.. లేటెస్ట్ ఫిల్మ్ జపాన్ రిలీజ్‌కు రెడీ అవుతుండగానే.. ఇప్పుడు మరో డైరెక్టర్‌కు ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగులో యంగ్ హీరో శర్వానంద్‌తో ఓ సినిమా చేసిన టాలెంటెడ్ డైరెక్టర్‌తో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని టాక్.
ప్రస్తుతం కార్తీ నటిస్తున్న ‘జపాన్’ సినిమా.. దీపావళికి రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాజ మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే జపాన్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. టీజర్ చూసిన తర్వాత కార్తి.. విలనా, కామెడియనా, హీరోనా అనే డౌట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఇక ఈ సినిమా తర్వాత కార్తి భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు.
ఆ మధ్య ‘సర్దార్’ మూవీతో హిట్ ఇచ్చిన పి.ఎస్. మిత్రన్‌తో సర్దార్ 2 చేయబోతున్నట్టు.. ఆ సినిమా సక్సెస్ మీట్లోనే అనౌన్స్ చేశాడు. ఇక కార్తి కెరీర్లో మాసివ్ హిట్‌గా నిలిచిన ‘ఖైదీ’ సీక్వెల్ ఎప్పుడో ప్రకటించాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇక ఇప్పుడు కార్తి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తమిళ్లో 96 సినిమాతో అదిరిపోయే లవ్ స్టోరీతో సాలిడ్ హిట్ అందుకున్న డైరైక్టర్ ప్రేమ్ కుమార్. ఇదే సినిమాను తెలుగులో శర్వానంద్, సమంతతో ‘జానూ’గా రీమేక్ చేశాడు. కానీ తెలుగులో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు కార్తితో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే ప్రేమ్ కుమార్ చెప్పిన కథ బాగా నచ్చడంతో.. కార్తి వెంటనే ఓకె చెప్పినట్టు సమాచారం. రూరల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కార్తి ఇందులో మధురైకి చెందిన వాడిగా నటించనున్నాడని టాక్. ఈ ప్రాజెక్ట్ సూర్య సొంత బ్యానర్ అయిన 2డీ ఎంటర్టైనమెంట్స్పై రూపొందనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుంది.