ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపారు. అనంతరం అధికారులు కూడా ప్రధానికి ప్రాథమిక నివేదిక అందించారు. అనంతరం ప్రధాని మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని పరిశీలించారు. రైలు బోగీలను తిలకించి ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు.
భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాద ఘటన ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accident). ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం 278 మంది చనిపోగా.. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. దేశమంతా తీవ్ర విషాదంలో (Tragedy) మునిగింది. ఈ ప్రమాదంపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష చేసిన అనంతరం ప్రధాని మోదీ (Narendra Modi) సంఘటన స్థలాన్ని సందర్శించారు. అనంతరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.
ఒడిశాలోని (Odisha) బాలేశ్వర్ (Baleshwar) ప్రాంతానికి యుద్ధ విమానంలో (Helicopter) ప్రత్యేకంగా ప్రధాని మోదీ వచ్చారు. హెలికాప్టర్ దిగగానే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw), మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపారు. అనంతరం అధికారులు కూడా ప్రధానికి ప్రాథమిక నివేదిక (Primary Report) అందించారు. అనంతరం ప్రధాని మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని పరిశీలించారు. రైలు బోగీలను తిలకించి ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. కాగా, సిగ్నల్ (Signal) పని చేయకపోవడం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే శాఖ (Indian Railways) ప్రకటించింది. ప్రమాద స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన గుడారంలో కొద్దిసేపు అధికారులతో మోదీ మాట్లాడారు.
అక్కడి నుంచి హెలికాప్టర్ కు చేరుకున్నారు. బాలసోర్ ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మరికొన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు మృతదేహాలను ఒకచోటకు చేర్చిన స్థలాన్ని చూశారు. మృతదేహాలను చూసి చలించిపోయారు. అక్కడ పరిస్థితి బీతావహంగా ఉంది. మృతులకు నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబసభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇంకా లభించలేదు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు రైల్వే అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.