అసోంలోని గౌహతి.. దాని పరిసర ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు(earthquake) వచ్చాయి. భూకంప కేంద్రాన్ని ధెకియాజులి లో గుర్తించారు. ఇది మీడియం సైజు భూకంపం కావడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. అలాగే ఎక్కడా ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని తెలిసింది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. నిన్న ఢిల్లీలో ఉదయం 11.23కి భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్లపాటూ ఈ ప్రకంపనలు వచ్చాయని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఢిల్లీతోపాటూ.. పంజాబ్ , హర్యానా , ఛత్తీస్‌గఢ్‌లో కూడా ప్రకంపనలు((earthquake)) వచ్చాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆప్ఘనిస్థాన్ లోని… ఫైజాబాద్‌లో 5.2 తీవ్రతతో ఆదివారం ఉదయం భూకంపం వచ్చింది. భూ ఉపరితలానికి 79 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అందువల్లే భూకంప తీవ్రత తక్కువగా ఉంది అంటున్నారు.