Assembly Elections 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ పూర్తి..ఓటింగ్ శాతం ఇంతేనా?
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో(Assembly Elections 2023) భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో చివరి దశ, మధ్యప్రదేశ్ ఒకేదశ ఎన్నికల పోలింగ్ నేడు పూర్తింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా..ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఏ మేరకు పోలింగ్ శాతం నమోదైందో ఇప్పుడు చుద్దాం.
మధ్యప్రదేశ్(madhya pradesh), ఛత్తీస్‌గఢ్(chhattisgarh)లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు పూర్తైంది. అయితే మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 71.16% ఓటింగ్ జరిగింది. అంతకుముందు 3 గంటల వరకు 60.52 శాతం, 1 గంటకు 45.40 శాతం, ఉదయం 11 గంటల వరకు 28.18 శాతం ఓటింగ్ నమోదైంది. అగర్ మాల్వా జిల్లాలో అత్యధిక ఓటింగ్ జరిగింది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు 82 శాతం ఓటింగ్ నమోదైంది.
డిమాని కేంద్రంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సీటుపై వివాదం జరిగింది. ఇక్కడ బదాపురా గ్రామానికి చెందిన స్త్రీ, పురుష ఓటర్లు దిమాని పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. బీజేపీ ప్రత్యేక వర్గాలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. బలవంతంగా ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా బీజేపీకి అనుకూలంగా ఓటు వేయనందుకు దాడి(attack) చేసి ఓటు వేయనివ్వడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఘటన పోలింగ్ బూత్ 191లో చోటుచేసుకుంది. వందలాది మంది గ్రామస్తులు ఓటు వేయకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని 70 స్థానాలకు రెండో, చివరి దశ పోలింగ్ కూడా పూర్తైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎనిమిది మంది మంత్రులు, నలుగురు ఎంపీలు సహా 958 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను 75 సీట్లకు పైగా గెలుపొందాలని అధికార పార్టీ కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ(BJP) భావిస్తోంది. 2003 నుంచి 2018 వరకు బీజేపీ ఇక్కడ వరుసగా 15 ఏళ్లు పాలించింది.
అన్ని స్థానాలకు సాయంత్రం 5 గంటలకు ఓటింగ్‌కు సమయం కేటాయించారు. రెండో దశ ఓటింగ్(voting)లో ఛత్తీస్‌గఢ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 68.15% ఓటింగ్ నమోదైంది. సరైపలి అసెంబ్లీ నియోజకవర్గంలో 71.12 శాతం పోలింగ్ నమోదైంది. బస్నాలో 70.30 శాతం, ఖల్లారిలో 70.69 శాతం ఓటింగ్ నమోదైంది. మహాసముంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అతి తక్కువ ఓటింగ్ జరిగింది. ఇక్కడ 68.16 శాతం మంది మాత్రమే తమ ఓటు వేశారు.
ధామ్తరి జిల్లాలోని మూడు అసెంబ్లీలలో ఓటింగ్ ఇప్పుడు చివరి రౌండ్లో ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 80 శాతం ఓటింగ్ జరిగింది. ధమ్తరి అసెంబ్లీలో 78.80%, కురుద్ అసెంబ్లీలో 82.60%, సిహవా అసెంబ్లీలో 78.20% ఓటింగ్ జరిగింది. జిల్లాలో మొత్తం 753 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 645, పట్టణ ప్రాంతాల్లో 108 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.