ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi), బీజేపీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గత నెలలో కాంగ్రెస్కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్.. భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ముందు ఆ పార్టీ ముఖ్య నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi), బీజేపీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గత నెలలో కాంగ్రెస్కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్.. భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ముందు ఆ పార్టీ ముఖ్య నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చలు ఫలించడంతోనే.. అయితే బీజేపీలో చేరిన తర్వాత.. ఢిల్లీ బీజేపీ ముఖ్య నాయకులతో కిరణ్ కుమార్ వరుసగా సమావేశమవుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన కిరణ్ కుమార్ రెడ్డి.. కేంద్ర హోం మంత్రి(Amit Shah)తో కూడా భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్దన్ రెడ్డి(Vishnu Vardan Reddy) కూడా అమిత్ షాను కలిశారు.
అయితే ఏపీ బీజేపీ(AP BJP)కి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించనట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు సోము వీర్రాజు ఢిల్లీలోనే ఉండనున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక పదవి కూడా అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న పరిచయాలు, రాజకీయ అనుభవం దృష్ట్యా తెలంగాణ(Telangana), కర్ణాటకలలో కూడా ఆయన సేవలను వాడుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప(Yeddyurappa)తో కూడా కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయినట్టుగా తెలుస్తోంది.
కర్ణాటక (Karnataka), తెలంగాణలలోని రెడ్డి సామాజిక వర్గం నేతలతో టచ్లోకి వెళ్లేలా కూడా బీజేపీ అధినాయకత్వం కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఏపీలో దాదాపు నాలుగేళ్ల పాటు సీఎం పదవిలో ఉన్న కిరణ్ .. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం నాలుగేళ్ల తర్వాత తిరిగి అదే పార్టీలో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ (Congress) లోనే ఉంటున్న కిరణ్.. తాజాగా ఆ పార్టీని వీడి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు కిరణ్ ను పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఆయన్ను పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక(Assembly election)ల్లో వాడుకునేందుకు సిద్ధమవుతోంది.