»Indian Hajj Pilgrims Die Among 600 People In Saudi Arabia
Hajj 2024: 600దాటిన మక్కాలో మరణించిన వారి సంఖ్య.. మృతుల్లో 68మంది భారతీయులు
సౌదీ అరేబియాలో హజ్ యాత్రలో 600 మందికి పైగా హజ్ యాత్రికులు మరణించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు మరణించారనే వార్త తెలియగానే భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికుల కుటుంబాల్లో ఆందోళన పెరిగింది.
Hajj 2024: సౌదీ అరేబియాలో హజ్ యాత్రలో 600 మందికి పైగా హజ్ యాత్రికులు మరణించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు మరణించారనే వార్త తెలియగానే భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికుల కుటుంబాల్లో ఆందోళన పెరిగింది. ఈ ఏడాది భారత్ నుంచి 1,75,000 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లారు. మరణించిన వారిలో 68 మంది భారతీయులు కూడా ఉన్నారని యాత్రకు సంబంధించిన దౌత్యవేత్త బుధవారం తెలిపారు. ఈ మరణాలు గత వారం రోజుల్లో సంభవించినవి. హజ్ చివరి రోజున ఆరుగురు భారతీయులు మరణించారు. మరణించిన వారిలో ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు, వృద్ధుల కారణంగా చాలా మరణాలు సంభవించాయి. అయితే కొన్ని మరణాలు తీవ్రమైన వేడి కారణంగా ఉన్నాయి. భారత పౌరుల మరణంపై కేంద్ర మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
577 మంది హజ్ యాత్రికులు అత్యధిక వేడి కారణంగా మరణించారు. తాజా నివేదిక ప్రకారం ఈ సంఖ్య 645 కి పెరిగింది. గత సంవత్సరం హజ్ సమయంలో 200 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి. చనిపోయిన హజ్ యాత్రికుల్లో ఎక్కువ మంది ఈజిప్టు పౌరులు. హజ్ సమయంలో మరణించిన 600 మందికి పైగా హజ్ యాత్రికులలో, గరిష్టంగా 323 మంది ఈజిప్టు నుండి, 35 మంది ట్యునీషియా నుండి, 44 మంది ఇండోనేషియా నుండి, 41 మంది జోర్డాన్ నుండి, 68 మంది భారతదేశం నుండి 11 మంది ఇరాన్ వాళ్లు ఉన్నారు. మరణించిన హజ్ యాత్రికుల మృతదేహాలను సౌదీ అరేబియాలోనే ఖననం చేస్తారు.
సౌదీలో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం
వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాలు దీని బారిన పడుతున్నాయి, ఒమన్, సౌదీ అరేబియా, యుఎఇ వంటి దేశాలలో వేడితో పాటు భారీ వర్షాలు కూడా ఉన్నాయి. సౌదీ అరేబియాలో ఉష్ణోగ్రత సాధారణంగా 45 డిగ్రీల మధ్య ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటింది. మక్కా మసీదులో ఈ సంవత్సరం ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకుంది.