గత ఏడాది తాను జైల్లో ఉన్న సమయంలో ఎంతో టార్చర్ కు గురయ్యానని లోకసభ ఎంపీ నవనీత్ రానా (MP Navneet Rana) అన్నారు. నటిగా ఆమె తెలుగువారికి నవనీత్ కౌర్ గా సుపరిచితులు. హనుమాన్ జన్మోత్సవ్ (hanuman janmotsav) సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 2022 ఇదే పండుగ సమయంలో తాను ఉద్దవ్ థాకరే (uddhav thackeray) ఇల్లు మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పారాయణం (hanuman chalisa parayanam) చేస్తానని పిలుపునిచ్చారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లిన ఆమె తాజాగా తాను గత ఏడాది ఎంత చిత్రహింసలకు గురయ్యానో చెప్పారు. జైలులో వారు ఎన్ని చిత్ర హింసలు పెట్టినా వారు మాత్రం న నమ్మకాన్ని వమ్ము చేయలేకపోయారన్నారు. ఆ సమయంలో ఏం తప్పు చేశాను.. ఎందుకు జైలుకు వెళ్లావని పిల్లలు తనను అడిగారన్నారు. తనను ఎందుకు జైలుకు పంపించారో ఉద్దవ్ థాకరేకే (Uddhav Thackeray) తెలియాలి అని నిప్పులు చెరిగారు.
ఉద్దవ్ (Uddhav Thackeray) తన పార్టీతో పాటు సిద్ధాంతాలను (shiv sena motto) కూడా కాపాడుకోలేకపోయారన్నారు. సొంత కుమారుడు పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కడం చూసి, దివంగత బాలాసాహెబ్ బాల్ థాకరే (bala saheb thackeray) బతికి ఉంటే కన్నీరు పెట్టుకునే వారు అన్నారు. ఉద్దవ్ అహంకారం, అతని మొండి వైఖరి ఎంతో కాలం కొనసాగదన్నారు. రాముడు (lord Rama) ఇలాంటి వారికి ఎంతో మందికి బుద్ధి చెప్పాడన్నారు. కాగా, నవనీత్ రానా అమరావతి ఎంపీగా (amravati mp navneet rana) ఉన్నారు. 2019లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆమె భర్త రవి రానా కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఏడాది హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామంటే ఉద్దవ్ అరెస్ట్ చేసి, జైలులో పెట్టారు. ఈ ఘటనను గుర్తు చేసుకొని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.