Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షం.. 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
చండీగఢ్-మనాలి హైవేపై కొండచరియలు విరిగిపడటంతో, హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్‌లోని పఠాన్‌కోట్‌లోని జాతీయ రహదారిపై కొన్ని కిలోమీటర్ల మేర జామ్ ఏర్పడింది. వాతావరణం స్పష్టంగా ఉన్నప్పటికీ, రహదారిని పునఃప్రారంభించడానికి చాలా గంటలు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.
Heavy Rains: భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్ మొత్తం స్తంభించింది. భారీ వర్షం, కొండచరియలు విరిగిపడ్డ కారణంగా రోడ్లపై వందలాది వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చండీగఢ్-మనాలి హైవేపై కొండచరియలు విరిగిపడటంతో, హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్‌లోని పఠాన్‌కోట్‌లోని జాతీయ రహదారిపై కొన్ని కిలోమీటర్ల మేర జామ్ ఏర్పడింది. వాతావరణం స్పష్టంగా ఉన్నప్పటికీ, రహదారిని పునఃప్రారంభించడానికి చాలా గంటలు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో వందలాది ట్రక్కులు, పర్యాటకుల వాహనాలు హైవేపై నిలిచిపోయాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా 6 మంది మరణించగా, 10 మంది గాయపడ్డారని హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓంకార్ చంద్ శర్మ తెలిపారు. 303 జంతువులు కూడా చనిపోయాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వర్షం కారణంగా ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. రెండు జాతీయ రహదారులు సహా 124 రోడ్లు ధ్వంసమయ్యాయి.
Jammu and Kashmir | A large number of trucks are stranded in Udhampur district as the Jammu-Srinagar national highway is blocked due to landslides triggered by heavy rainfall in the Ramban sector. pic.twitter.com/BelzO8h76l
151 డిటిఆర్లు ప్రభావితమయ్యాయని, 6 లైన్లలో నీటి సరఫరా కూడా అంతరాయం కలిగిందని ఆయన తెలిపారు. స్థానికుల సహకారంతో పలువురు పర్యాటకులను రక్షించారు. హిమాచల్ ప్రదేశ్ కు వచ్చే వారు రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు. చండీగఢ్-మనాలి జాతీయ రహదారి 7 మైల్ మార్క్ సమీపంలో, కొండచరియలు విరిగిపడిన కారణంగా రహదారిని మూసేశారు.
మరోవైపు, జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్‌లోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ సెక్టార్లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. ఒక ట్రక్ డ్రైవర్ మాట్లాడుతూ.. ‘భారీ వర్షం కురుస్తున్నందున ముందు రహదారి మూసివేయబడిందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇక్కడే ఉండిపోయాం. ఇక్కడ ఒక లైన్ నుంచి 250 నుంచి 300 ట్రక్కులు వరుసగా నిలిచిపోయాయన్నాడు.