Firing: మణిపూర్‌లో పోలింగ్‌లో గన్ ఫైర్.. పరుగులు తీసిన ఓటర్లు

మణిపూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు జరిగాయి. దీంతో ఓటు వేయడానికి వచ్చిన జనాలు పోలీంగ్ బూతుల నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

  • Written By:
  • Updated On - April 19, 2024 / 02:37 PM IST

Firing: దేశంలో మొదటి విడుదల పోలింగ్ ఈ రోజు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్‌ (Manipur)లో పోలీంగ్ జరుగుతుంది. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌లో ఒక్కసారిగా కాల్పులు కలలం రేపాయి. దాంతో ప్రజలు పోలింగ్ బూతుల నుంచి ప్రాణభయంతో పరుగులు పెట్టారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వెళా మణిపూర్‌లో మరోసారి కాల్పుల (Firing) ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఆ రాష్ట్రంలోని రెండు నియోజరవర్గాలలో ఈ రోజు ఓటింగ్ జరుగుతుంది.

చదవండి:Arvind Kejriwal: నాకు ఇంజక్షన్లు ఇవ్వండి.. కోర్టులో కేజ్రీవాల్‌ పిటీషన్

ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే ఇన్నర్‌ మణిపూర్‌, ఔటర్‌ మణిపూర్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. దాంతో శాంతియుతంగానే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అప్పటివరకు శాంతంగా జరుగుతున్న ఓటింగ్ మొయిరాంగ్ సెగ్మెంట్‌లోని థమన్‌పోక్పిలో ఉన్న ఓ పోలింగ్ బూత్ సమీపంలో ఫైర్ జరిగింది. కొందరు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. చుట్టు రెక్కి చేశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టారు. కాల్పుల అనంతరం బయటకు ప్రజలు పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చదవండి:Sri Krishna : శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్న యువతి!

Related News