»Congress Claims Lpg Prices Been Increased 185 Percent But Reduced Only 17 5 Percent In 9 Years
LPG Prices: మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో పెంచిందేమో 185శాతం.. తగ్గించింది 17.5శాతం మాత్రమే
ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రసవత్తరంగా రాజకీయం జరుగుతోంది. గృహోపకరణాల వంటగ్యాస్‌పై సిలిండర్‌పై రూ.200 తగ్గింపు నిర్ణయంపై పార్టీ అధికార ప్రతినిధి, సోషల్ మీడియా విభాగం అధిపతి సుప్రియా శ్రీనాట్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
LPG Prices: ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రసవత్తరంగా రాజకీయం జరుగుతోంది. గృహోపకరణాల వంటగ్యాస్‌పై సిలిండర్‌పై రూ.200 తగ్గింపు నిర్ణయంపై పార్టీ అధికార ప్రతినిధి, సోషల్ మీడియా విభాగం అధిపతి సుప్రియా శ్రీనాట్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఎల్పిజి ధరను 185 శాతం పెంచిందని, ఇప్పుడు దానిని 17.5 శాతం మాత్రమే తగ్గించిందని కాంగ్రెస్ బుధవారం పేర్కొంది. గత 9.5 ఏళ్లలో ఇంధనంపై పన్ను పెంచడం ద్వారా ఈ ప్రభుత్వం రూ.30 లక్షల కోట్ల లబ్ధి పొందిందని పేర్కొన్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిపక్ష కూటమి ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్’ (ఇండియా) బలం రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఎల్ పీజీ ధరలను తగ్గించిందంటూ సుప్రియా శ్రీనెట్ ఒక వీడియోను విడుదల చేసింది. ఇది (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) ఇండియాకు ఉన్న శక్తి.. అందుకే కేంద్ర దిగొచ్చి ధరలను తగ్గించి ప్రజల్లో తమ ఉనికి కాపాడుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని వారు ఆరోపించారు. కొనుగోలు శక్తి ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎల్పీజీని భారత్‌లో విక్రయిస్తున్నారని, 2014లో దేశంలో ఎల్పీజీ ధర రూ.400 ఉండగా, 2023లో రూ.1140కి పెరుగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్నారు. తొమ్మిది సంవత్సరాల్లో 185 శాతం పెరిగింది. ఇప్పుడు ఆగస్టు 2023లో LPG ధర 17.5 శాతం తగ్గించబడిందన్నారు.