»12 People Detained In Jammu And Kashmir Terror Attack On Army Vehicle Case
J&K Attack: జమ్ము కశ్మీర్ ఉగ్రదాడి కేసులో అదుపులో 12 మంది
జమ్ము కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉధృతమైన నిఘాతోపాటు సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్లలో హై అలర్ట్ విధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతోపాటు పూంచ్ సెక్టార్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అధికారులు(officers) 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు వారు ఎటాక్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించి పలు వివరాలను సేకరించారు.
జమ్ము కశ్మీర్ పూంచ్ సెక్టార్లో ఆర్మీ సైనికుల వాహనంపై ఘోరమైన ఆకస్మిక దాడికి సంబంధించి దాదాపు 12 మందిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ఒక సంవత్సరానికి పైగా పలువురు ఉన్నారని బహుశా వారు స్నిపర్ సెల్స్ అయిఉండవచ్చనే కారణంతో భద్రతా దళాలు వారిని ప్రశ్నిస్తున్నాయి. దీంతోపాటు వారికి ఉగ్రవాద గ్రూపలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా వివరాలను ఆరా తీస్తున్నారు.
దాడి జరిగిన రోజు తర్వాత జమ్ము కశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ ముఖేష్ సింగ్ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనను పర్యవేక్షించేందుకు పొరుగున ఉన్న రాజౌరి జిల్లాలో క్యాంప్ చేశారు. ఇద్దరు అధికారులు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి పలు వివరాలను సేకరించారు. మరోవైపు ఈ కేసును ఏజెన్సీ టేకోవర్ చేసే అవకాశం ఉన్నందున డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం కూడా హాజరైంది.
ఆర్మీ ట్రక్ మూడు వేర్వేరు వైపుల నుంచి దాడికి గురైనట్లు అధికారులు(officers) భావిస్తున్నారు. ఆకస్మిక దాడి తర్వాత ఉగ్రవాదులు గ్రెనేడ్లతో పాటు స్టిక్కీ బాంబులను కూడా ఉపయోగించి వాహనాన్ని పేల్చి వేశారని ప్రాథమికంగా గుర్తించారు. అయితే దాడిని అమలు చేసిన వారు రాజౌరీ, పూంచ్లలో సంవత్సరానికి పైగా ఉన్నారని తెలుస్తోంది. ఆ ప్రాంతంపై అవగాహన ఉన్న వారే అలా దాడి చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజౌరీ, పూంచ్ ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు ఉగ్రవాద గ్రూపులు చురుకుగా పనిచేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు నిషేధిత ఉగ్రవాద సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF), ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ యొక్క ప్రాక్సీ వింగ్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్లను కూడా ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సైన్యం కూడా MI-చాపర్తో ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించింది. గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.